పెంచికల్‌పేట్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు వినతి

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 21:  కమాన్‌పూర్‌ మండలం పెంచికల్‌పేట్‌ గ్రామ సర్పంచ్‌ పల్లె మాధవి–నారాయణ దంపతులు సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెంచికల్‌పేట్‌ నుంచి రేపల్లెవాడ వరకు రహదారి నిర్మాణం, మొదటి వార్డులో మద్దెల వాగుపై కల్వర్టు నిర్మాణం, 1, 2వ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో...