janodaya.in
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 10:50 am Digital Edition : VAMSHI PADALA

పుట్టినరోజు వేళ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ

🔹హెల్పింగ్‌ హాండ్స్‌ అధ్యక్షుడు నారగోని సతీష్‌ గౌడ్‌ సేవా కార్యక్రమం

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 23:

కమాన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన హెల్పింగ్‌ హాండ్స్‌ సంస్థ అధ్యక్షులు నారగోని సతీష్‌ గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కమాన్‌పూర్‌ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 23 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌ చేతుల మీదుగా ఈ సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌ మాట్లాడుతూ.. హెల్పింగ్‌ హాండ్స్‌ సంస్థను స్థాపించిన నారగోని సతీష్‌ గౌడ్‌ సంస్థ ద్వారా ఎంతోమందికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక సేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా, సమాజానికి సేవలందించే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని, వారి శ్రమను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ, నారగోని సతీష్‌ గౌడ్‌ను అభినందించి శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ గ్రామ ఉపసర్పంచ్ మహమ్మద్ రఫిక్ సోహెల్ తో పాటు హెల్పింగ్ హాండ్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.