పసి ప్రాణానికి ‘హెల్పింగ్ హ్యాండ్స్’ అండ.. రూ.1.16 లక్షల ఆర్థిక సాయం
జనోదయ,కమాన్‌పూర్, సెప్టెంబర్ 6: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమాన్‌పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బర్ల రమేష్ కుమార్తె మచ్చ సుమాంజలి–స్వామి దంపతుల నాలుగు నెలల కుమారుడు తీవ్రమైన మూర్ఛలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్య ఖర్చులకు సుమారు రూ.14 లక్షలు అవసరమవుతాయని వైద్యులు సూచించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు...