పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాల అమలు – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జనోదయ, గంగాధర, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఇస్లాంపూర్, కోట్ల నరసింహులపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గర్శకుర్తిలో రూ.10 లక్షలు, వెంకంపల్లిలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా ఇస్లాంపూర్, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్, చర్లపల్లి (ఎన్),...