–కుటుంబానికి అండగా ఉంటాం – వర్షంలో తడిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 20
పెట్రోల్ దాడిలో దారుణ హత్యకు గురైన 14వ డివిజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కో-ఆర్డినేటర్ అడుప మహేష్ కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరామర్శించారు.
సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ ఆయుబ్, ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ తో కలిసి మహేష్ ఇంటికి వెళ్లారు.
వర్షంలో తడిస్తూ పాడె మోశారు మహేష్ మృతదేహంపై పార్టీ జెండా కప్పిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వర్షానికి సైతం లెక్క చేయకుండా అంత్యయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా పాడె మోసి కార్యకర్త పట్ల ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేఆర్ నాగరాజు, మహేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. దోషుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తానని, కఠినమైన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని, అధిష్టానం ఇచ్చే సహాయంతో పాటు తన వంతుగా కూడా సహాయం చేస్తానని ప్రకటించారు. మరణవార్త తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నీ దగ్గరుండి చూశారని, కుటుంబ సభ్యులకు అండగా నిలిచారని స్థానికులు తెలిపారు. “మంచి నాయకుడిని కోల్పోయాం” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఆటో యూనియన్, బంధువులు స్నేహితులు.