తాళం వేసిన ఇంటిలో చోరీ.. 13.75 తులాల బంగారం అపహరణ

గంగాధర, జూన్ 16 (జనోదయ):  కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నాగిరెడ్డిపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు సుంకనపల్లి రమేష్ ఫిర్యాదు మేరకు, ఈ నెల 12న మధ్యాహ్నం తన భార్యతో కలిసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామయ్యను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. మూడు రోజుల అనంతరం సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన తాళం పగులగొట్టి తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించాడు. అనుమానం...