-కొండా దంపతుల నాయకత్వంలో భారీ గజమాలతో సన్మానం
-రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో
-60 కార్లతో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
జనోదయ: వరంగల్ ప్రతినిధి: (Siluveru Srinivas)
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు వరంగల్ తూర్పు నియోజకవర్గం దామెర క్రాస్ రోడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాల వేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తపెళ్లి శ్రీనివాస్, ఇనాయత్, అక్తర్, భాషాపాక సదానందం, మబ్బు ప్రవీణ్, సిద్ధం రాము, చిన్న పటేల్, కత్తెరసాల శ్రీధర్, బెడుద వీరన్న, కురుమిళ్ల సంపత్, ముష్కమల్ల సుధాకర్, భైరబోయిన దామోదర్ యాదవ్, తొగర్ క్రాంతి, క్యాతం రవీందర్, దామెర రాజ్ కమల్, పల్లం రవి, కోడం శివకృష్ణ, పగడాల సతీష్, దామెర కొండ కరుణాకర్, జంగం ప్రభాకర్, ఠాకూర్ బజరంగ్ సింగ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 60 కార్లలో కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.