janodaya.in
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 3:03 pm Digital Edition : JANODAYA MEDIA

జ్యోతిరావు పులే విగ్రహం పై ధాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి

🔹దుండగుల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి

🔹మతోన్మాద శక్తులను తరిమికొట్టాలి

🔹ధలిత బహుజన ఫ్రంట్ హనుమకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్

జనోదయ,హనుమకొండ, ఫిబ్రవరి 08:

భరతదేశ తొలి తరం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చూసిన దుండగులను వెంటనే రాజద్రోహం కేస్ పెట్టి అరెస్ట్ చెయ్యాలని ధళిత బహుజన ఫ్రoట్ హనమకొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ డిమాండ్ చేసారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహం పైనా దాడి చేసి కాళ్ళతో తన్నడం సిగ్గుచేటని,బహుజనులంతా ఏకమై మతోన్మధ శక్తులను తిప్పికొట్టాలని,ధలిత బహుజన ఫ్రoట్ హనమ కొండ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ అన్నారు.శివాజీ ఛత్రపతి మహారాజ్ చరిత్ర ను సమాజానికి పరిచయం చేసిన మహనీయుడు మహాత్మా పూలే అని కొనియాడారు.ఆయన తన బార్య సావిత్రి భాయి పూలే కి చదువు నేర్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసి అనగారిన వర్గాల మహిళలకు చదువు నేర్పిన గొప్ప మహానేత విగ్రహం ద్వంసం చేయాలనుకున్న వారు ముఖ్యoగా పూలే చరిత్ర తెలుసుకోవాలన్నారు.అలాగే జ్యోతి రావు పూలే, అంబేద్కర్ విగ్రహాల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది బి.సారంగపాణి,నాయకులు రాజు,రాజశేఖర్,సాయి చరణ్,రాములు పాల్గొన్నారు.