janodaya.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 4:35 pm Digital Edition : JANODAYA MEDIA

రత్నాపూర్‌లో నేత్రదాత కండమల్లయ్య దశదినకర్మలు

🔹నేత్రదానానికి నివాళి

🔹లయన్స్ క్లబ్,సదాశయ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

🔹కుటుంబానికి ధైర్యం తెలిపిన మాజీ జడ్పిటిసి వెంకటరమణారెడ్డి

జనోదయ,రామగిరి ఫిబ్రవరి 6:

రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామంలో మానవత్వాన్ని ప్రతిబింబించే హృదయస్పర్శి కార్యక్రమం జరిగింది.లైన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాత కీర్తిశేషులు కండమల్లయ్య గారి దశదినకర్మ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి,లయన్స్ క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కండమల్లయ్య గారు చేసిన నేత్రదానం మహోన్నతమైన సేవ అని,ఆ దానంతో ఎందరో దృష్టి కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగు నిండిందని కొనియాడారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,ఈ అపార నష్టాన్ని తట్టుకునేందుకు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ తరహా దాతలు ఎప్పటికీ స్మరణీయులేనని అన్నారు.

కార్యక్రమం మొత్తం సేవా భావంతో,ఆత్మీయతతో సాగింది.లైన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ప్రతినిధులు,సదాశయ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు.మానవ జీవితంలో కన్ను వెలుగు ఎంత విలువైనదో,దానిని మరొకరికి అందించడం ద్వారా నిజమైన మానవత్వం చాటవచ్చని వారు పేర్కొన్నారు.