janodaya.in
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 9:02 pm Digital Edition : JANODAYA MEDIA

మహిళలపై బైండోవర్

జనోదయ,మందమర్రి ఫిబ్రవరి 4:

మందమర్రి పట్టణ పరిధిలో అక్రమ మద్యం,గుడుంబా విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మద్యం విక్రయాలకు పాల్పడుతున్న మహిళలను అధికారులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు చట్టపరమైన హెచ్చరికలతో బైండోవర్ నిర్వహించారు.పట్టణంలో గుట్కా,గంజాయి,గుడుంబా వంటి నిషేధిత పదార్థాల విక్రయాన్ని ఏమాత్రం సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.