జనోదయ,మందమర్రి ఫిబ్రవరి 3:సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఏరియా డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్ కోరారు. మంగళవారం ఏరియాలో సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, రామకృష్ణ పూర్ లోని బ్యాటీషియన్ తరగతు లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతులు ముగించుకున్న ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి పొంది, ప్రతి ఒక్కరికి మార్గ దర్శకులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణలు పాల్గొన్నారు.