janodaya.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 1:11 pm Digital Edition : JANODAYA MEDIA

ఆదివరాహ మహిళా మండల సమాఖ్య కార్యాలయానికి సందర్శించిన సర్పంచ్

🔹మహిళా సంఘాల పనితీరు,స్వయం ఉపాధి కార్యక్రమాల పురోగతిపై చర్చించిన సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 6:

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ మహిళా మండల సమాఖ్య కార్యాలయాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ సందర్శించారు.ఈ సందర్భంగా మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పద్మను కలిసి మహిళా సంఘాల పనితీరు,స్వయం ఉపాధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు.అనంతరం మండల సమాఖ్య అధికారులు సర్పంచ్‌ను శాలువతో సత్కరించారు.మహిళల ఆర్థిక స్వావలంబనకు గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు బిక్షపతి,మల్లయ్య,మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు,సభ్యులు పాల్గొన్నారు.