పని ప్రదేశాల్లో మహిళా భద్రతకు చట్టబద్ధ రక్షణ: జిల్లా సహాయ కార్మిక అధికారి హేమలత
🔹అంతర్గత ఫిర్యాదుల కమిటీలు తప్పనిసరి 🔹చట్టాన్ని అమలు చేయని సంస్థలపై జరిమానా 🔹షీ బాక్స్ పోర్టల్‌లో కమిటీ వివరాల నమోదు అనివార్యం జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 6: పెద్దపల్లిలో మహిళా కార్మికుల భద్రతపై కీలక ప్రకటన వెలువడింది.పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (Internal Complaints Committees – ICC) ఏర్పాటు చేయాలని సహాయ కార్మిక అధికారి కే.హేమలత స్పష్టం చేశారు.శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె,చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని...