janodaya.in
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 4:25 pm Digital Edition : JANODAYA MEDIA

చొప్పదండి నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఓటు వేసి గెలిపించిన చొప్పదండి నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటాను

రెండేళ్లలోనే  చొప్పదండి మండలానికి ఇంటిగ్రేటెడ్ కళాశాల, రామడుగు మండలానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల, కొడిమ్యాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్, బోయినపల్లి మండలానికి మినీ స్టేడియం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి 35 కోట్లు  మంజూరు చేయించాం

 గత టిఆర్ఎస్ పాలనలో అప్పటి ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు, పార్టీ పదవులకు, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద కమిషన్లు వసూలు చేశారు

 బిఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నారాయణపూర్ కుడికాలువను పూర్తి చేస్తాము

గంగాధర మండలం వెంకటయ్యపల్లి ఎల్ కె గార్డెన్లో చొప్పదండి నియోజకవర్గం పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జనోదయ గంగాధర జూన్ 15 :

చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం గంగాధర మండలం వెంకటయ్యపల్లి ఎల్కే గార్డెన్ లో నిర్వహించిన చొప్పదండి నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లపాటు  తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు అప్పగా మార్చాలని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.  నాటి ముఖ్యమంత్రి కేసీఆర్  వరిస్తే ఉరే అని, రైతులు వరి సాగు చేయొద్దని చెప్పాడని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాడని పేర్కొన్నారు.  గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చొప్పదండి నియోజకవర్గం లోని 3500 ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చినట్లు, మరో 2500 ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తున్నట్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం   అందజేస్తున్నట్లు తెలిపారు.  గత పది ఏళ్లలో చొప్పదండి నియోజకవర్గం లో  అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  చొప్పదండి మండలానికి ఇంటిగ్రేటెడ్ కళాశాల, రామడుగు మండలానికి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల, బోయిన్పల్లి మండలానికి మినీ స్టేడియం, కొడిమ్యాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంకి 35 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ భూసేకరణ కోసం 23. 5 కోట్లు  మంజూరు చేయించినట్లు తెలిపారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ రైతులపై తాను కేసులు పెట్టించినట్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అక్కడ కేసులు పెట్టింది టిఆర్ఎస్ మహిళా నాయకురాలని, కేసులు నమోదయింది బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైనేనని పేర్కొన్నారు. పూడూరు, గంగాధర చొప్పదండి లో ధర్నాలు చేసినప్పుడు కేసులు నమోదు కాలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ కుడికాల నిర్మాణం పూర్తయితే  మేడిపల్లి సత్యం కు ఎక్కడ పేరొస్తుందోనని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, వారిని కుట్రలు పండిన  కుడి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నిలుపుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బూతు లెవెల్ సమావేశ పరిశీలకుడు  నమిండ్ల శ్రీనివాస్, జిల్లా  గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,  టిపిసిసి సభ్యుడు గోగురి మహిపాల్ రెడ్డి,ఆరు మండలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జవ్వాజి హరీష్, మంత్రి మహేందర్, కొమ్మనబోయిన సువిన్ యాదవ్, గోగురి నాగభూషణ్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి,  జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రోమల రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోల రమేష్ ,కరీంనగర్, సిరిసిల్ల బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు  పులి ఆంజనేయులు గౌడ్, కూస రవీందర్, చొప్పదండి మున్సిపల్ చైర్మన్  వడ్లూరి సరిత శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్ రావు, రాజ నరసింగరావు ,మార్కెట్ కమిటీ చైర్మన్లు పోత్తూరి మహేష్, బోయిని ఎల్లేష్ యాదవ్, బొమ్మరవేణి తిరుమల, జాగరిపు రజిత, మరియు సర్పంచులు కాంగ్రెస్ నాయకులు  కార్యకర్తలు బూతులు ఏజెంట్స్ పాల్గొన్నారు.