చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షుడిగా బొక్కెన కృష్ణకుమార్ ఎన్నిక
జనోదయ చొప్పదండి ఫిబ్రవరి 11: చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా బొక్కెన కృష్ణకుమార్‌ను యూనియన్ అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్‌గా) ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సంక్షేమం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మెడిప్రసాద్, ఉపాధ్యక్షులుగా...