జనోదయ చొప్పదండి ఫిబ్రవరి 11:
చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా బొక్కెన కృష్ణకుమార్‌ను యూనియన్ అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్‌గా) ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడారు.
తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సంక్షేమం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో యూనియన్ కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేశారు.
యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మెడిప్రసాద్, ఉపాధ్యక్షులుగా పి. జలందర్, మొగిలి మహేష్, రేగుల మహేష్‌లను నియమించారు.
ప్రధాన కార్యదర్శిగా మేడి శుభాష్, కోశాధికారిగా సామల విజయ్‌ను ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శులుగా బొగా సూర్య తేజ బాధ్యతలు స్వీకరించారు. అలాగే ప్రధాన సలహాదారులుగా చిన్న దేవేందర్, అల్లావుద్దీన్‌లను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.