చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్ల విడుదల..మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలిచింది : పిల్లి చంద్రశేఖర్ పెద్దపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు
జనోదయ, కమాన్‌పూర్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లల నిల్వ (స్టాకింగ్) కోసం అదనంగా రూ.116 కోట్లు విడుదల చేయడాన్ని మంథని నియోజకవర్గ మత్స్యకారులు స్వాగతించారు. ఈ నిర్ణయం మత్స్యకార కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో కమాన్‌పూర్ మత్స్యకార సహకార సంఘం, మంథని నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్...