చిన్నారి చికిత్సకు రూ.1,04,346 విరాళం.. చిన్నారి వైద్యానికి చత్రపతి శివాజీ యువసేన చేయూత
జనోదయ,కమాన్‌పూర్ ఆగస్టు 31: జూలపల్లికి చెందిన నాలుగు నెలల చిన్నారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మల్యాల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రూ.1,04,346 విరాళాలు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు యువసేన సేవా కార్యక్రమాన్ని అభినందించి, చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువసేన సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.