కరీంనగర్, జూలై 5 (జనోదయం):
కొత్తపెల్లి మణెమ్మ చిన్నకర్మ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఆదివారం కరీంనగర్ వృద్ధ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మణెమ్మ పెద్ద కుమార్తె రాజ్యలక్ష్మి, అల్లుడు శంకరయ్య, మనుమరాలు జయశ్రీ, మనుమడు విజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణెమ్మ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని వారు ప్రార్థించారు.
