janodaya.in
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:01 am Digital Edition : VAMSHI PADALA

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 17: 

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను గ్రామ సర్పంచ్‌ రంగు సత్యనారాయణ గౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మహ్మద్‌ రఫీక్‌ సోహెల్‌, వార్డు సభ్యుడు పచ్చునూరి రాజ్‌కుమార్‌, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.