జనోదయ గంగాధర మార్చి 21:
కరీంనగర్ జిల్లా ధర్మ జాగరణ విభాగ్ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ధర్మ జాగరణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు సత్సంగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా విధి ధర్మచరణ విధి ప్రముఖ్ కత్రోజు ప్రభాకర్ (అడ్వకేట్), పూర్తి సమయ కార్యకర్త కాముని శంకర్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి శ్రీనివాస్, సామల బుచ్చిరాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సామూహిక హారతిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ధర్మ జాగరణ కార్యకర్తలు సమాజంలో ధర్మ చైతన్యం పెంపొందించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్సంగ కార్యక్రమం నిర్వహించి నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.