janodaya.in
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 10:36 pm Digital Edition : JANODAYA MEDIA

కమాన్‌పూర్ తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వార్డు సభ్యులు

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 3:

కమాన్‌పూర్ మండల తహసీల్దార్ వాసంతిను మంగళవారం కమాన్‌పూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 1వ వార్డు సభ్యుడు మిట్ట సందీప్, 2వ వార్డు సభ్యుడు గుంజపడుగు నవీన్లు మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. గ్రామస్థాయిలో పాలన మరింత సమర్థంగా సాగేందుకు అధికారులు–ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ప్రజాహితానికి సంబంధించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన తహసీల్దార్‌కు వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.