జనోదయ,కమాన్‌పూర్ సెప్టెంబర్ 3:
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల్లో పొంతన లేని లేదా తప్పుడు పొంతన ఉన్నట్లు గుర్తించిన కొంతమంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న కమాన్‌పూర్ ఓటర్లు గురువారం గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకున్నారు.

సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధ్రువీకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సూచనలు అందిస్తూ, పత్రాల పరిశీలనలో అధికారులు సహకరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాసంతి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్రవంతి, పంచాయతీ కార్యదర్శి రాము, ఉపసర్పంచ్ రఫీక్ సోహెల్, వార్డు సభ్యులు పంజా సాయిరాం, పచ్చునూరి రాజ్ కుమార్, మెరుగు కుమార్, గోడిశెల లింగస్వామి, తూటి రాజు, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ కిరణ్, బీఎల్‌ఓలు, రెవెన్యూ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని ఓటర్లకు అవసరమైన సహకారం అందించారు.