janodaya.in
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:14 am Digital Edition : VAMSHI PADALA

ఎస్ ఎస్ అన్వర్‌కు ఉపసర్పంచ్‌ రఫిక్‌ సోహెల్‌ సన్మానం

జనోదయ,కమాన్‌పూర్‌ సెప్టెంబర్‌ 4:

కమాన్‌పూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎస్‌.ఎస్‌. అన్వర్‌ మరోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కమాన్‌పూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ మహమ్మద్‌ రఫిక్‌ సోహెల్‌ అన్వర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రఫిక్‌ సోహెల్‌ మాట్లాడుతూ.. అన్వర్‌ భాయ్ మరోసారి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇక్బాల్, మల్యాల మహేష్ గౌడ్, పంజా సాయిరాం గౌడ్, మైనారిటీ నాయకులు యూసఫ్ లల్లు, నజీబ్, ముజాహిద్, ఇక్బాల్, సద్దాం, నిజాం, అఫ్రోజ్, షోయబ్, ఇర్ఫాన్, మౌలానా అలీ తదితరులు పాల్గొన్నారు.