ఎవరు జర్నలిస్ట్?..ఎవరికి అక్రిడిటేషన్?
ఇటీవల జర్నలిస్టులంటే ఎవరు? అనే సందేహాలు నలువైపుల నుంచి వస్తున్నాయి. జర్నలిస్టులని ఓ వైపు ప్రజలు మరో వైపు ప్రభుత్వం గుర్తించాలంటే ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణ రాయితీ కార్డు అక్రిడిటేషన్ అనేదే ప్రామాణికమని కొందరంటుంటే లేదు.. లేదు అక్రిడిటేషన్‌కి జర్నలిస్టులకి సంబంధం లేదని మరికొందరంటున్నారు. ఇలా రెండు భిన్న వాదనల నడుమ పాత్రికేయులు అంటే ఎవరు? వారి విధివిధానాలంటే ఏంటనే ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం... జర్నలిజాన్ని ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలుస్తారు. శాసన,కార్యనిర్వాహక, న్యాయ...