ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డిదే బాధ్యత
ఆయనది ఆత్మహత్య కాదు-ప్రభుత్వ హత్యే శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గం గంగాధర, ఏప్రిల్ 24 (జనోదయ): ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర మండలంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, శంకర్ గౌడ్ మరణం సాధారణ ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల...