ఆపదలో ఆపన్నహస్తం… మేడి ప్రసాద్ సేవలకు ప్రశంసలు
కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌కు చెందిన RTV చొప్పదండి నియోజకవర్గ జర్నలిస్ట్ మేడి ప్రసాదు సమాజ సేవలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించడం, పోలీసులకు సమాచారం అందించడం వంటి సేవలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, “అరవు అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శివాధర్ రెడ్డి స్వయంగా మేడి...