కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌కు చెందిన RTV చొప్పదండి నియోజకవర్గ జర్నలిస్ట్ మేడి ప్రసాదు సమాజ సేవలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించడం, పోలీసులకు సమాచారం అందించడం వంటి సేవలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, “అరవు అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శివాధర్ రెడ్డి స్వయంగా మేడి ప్రసాదుకు ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం కూడా ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడం గొప్ప సేవ అని, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శమని తెలిపారు. మేడి ప్రసాదు చేసిన సేవలు ఇతరులకు కూడా ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.
మేడి ప్రసాదు మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు కాపాడటం తన బాధ్యతగా భావించి ఈ సేవలను కొనసాగిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు.