ఆత్మ పథకంతో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై ప్రత్యక్ష అవగాహన

జనోదయ,పాలకుర్తి ఆగస్టు 23: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ, రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతు విజ్ఞాన కేంద్రం, పెద్దపల్లి సమన్వయకర్త డాక్టర్ ఓ. సంపత్ పర్యవేక్షణలో శనివారం పాలకుర్తి మండలంలోని మూడు గ్రామాల్లో ఆత్మ పథకం కింద ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. కన్నాల గ్రామంలో వరి, పత్తి పంటల్లో జీవ ఎరువుల వినియోగంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. భూమిలో భాస్వరం లభ్యతను పెంచే ఫాస్పరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా...