అవార్డులతో అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వైద్య బృందం

  జనోదయ,పెద్దపల్లి,ఏప్రిల్ 7: పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు రాష్ట్ర స్థాయిలో మరొకసారి ప్రశంసలు అందుకున్నాయి.వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ ఆసుపత్రి రాష్ట్రంలోనే అత్యధిక అవార్డులను సొంతం చేసుకుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ ఈ అవార్డులను స్వీకరించారు. సూపరిండెంటెంట్ విభాగంలో సమర్థ నిర్వహణతో పాటు అనస్థీషియా నిపుణుడిగా సేవలందించినందుకు ‘ఉత్తమ సూపరిండెంటెంట్’గా తొలి అవార్డు దక్కింది.ఆరోగ్యశ్రీ పథకంలో అత్యధిక కేసులను సమర్థవంతంగా...