రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ వరప్రదాయని వర్ణ కాలువను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ
పదేళ్లలో రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బిఆర్ఎస్ పార్టీ
నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేసేది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రమే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్
జనోదయ చొప్పదండి జూలై 28:
తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ పేర్కొన్నారు. మంగళవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయని వరద కాలువను కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని, 2004లో అప్పటి ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో వరద కాలువకు బీజం పడిందని గుర్తు చేశారు. 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో 90 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. 2014 లో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం పై దృష్టి పెట్టలేదన్నారు. పదేళ్ల కాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ లో తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా నారాయణపూర్ గ్రామానికి వెళ్లలేదన్నారు. 2023లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గెలిచిన తర్వాత నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం అందజేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చారని, ఇక్కడ రిజర్వాయర్, నిర్వాసిత పరిస్థితిని ఎమ్మెల్యే వివరించినట్లు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి చేయడంతో పాటు, ఆసితులకు పరిహారం అందజేయడానికి సుమారు 70 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తయితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు పేరు వస్తుందని, తాము శాశ్వతంగా మాజీలు అవుతాని కుట్రపూరితంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను, నారాయణపూర్ గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నారాయణపూర్ గ్రామాన్ని తొంగి చూడని మాజీ ఎమ్మెల్యేకు అకస్మాత్తుగా ఇక్కడి నిర్వాసితుల పైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే వర్షం కురవడం లేదన్నట్లు టిఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన నారాయణపూర్ రిజర్వాయర్ని పూర్తి చేయడంతో పాటు, నిర్వాసితులకు న్యాయం చేసేది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి గుర్తుంచుకోవాలని హితోపలికారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రొమాల రమేష్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య, గునుకొండ బాబు,మాజీ ఎంపిపి పడితపల్లి కిషన్,మహిళా కాంగ్రెస్ నాయకులు చిరుత మంగ,తోట సంధ్య, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు ముద్దం నగేష్,సర్పంచ్ లు,రాచమల్ల రవి, బీర్ల ఆనంద్, లింగాల లింగయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగి అజయ్ రావు,బూరుగు గంగన్న, ధీకొండ మధు,కోలేపాక మల్లేశం,ఉప్పుగండ్ల మోహన్ రెడ్డి,ఉప్పుగండ్ల రాం రెడ్డి,వంగల శ్రీధర్, పౌల్,అత్తపురం తిరుపతి,దోమకొండ కమలాకర్,పర్లపల్లి మోహన్,పిట్టల మల్లేశం,కల్లెపల్లి జానీ,యువజన కాంగ్రెస్ నాయకులు వొడ్నాల వంశీ,కడారి కుమారస్వామి,తాళ్ల దిలీప్,కముటం శ్రీనివాస్,జుర్రు పరుశరాం కార్యకర్తలు, మహిళలు,విద్యార్థులు పాల్గొన్నారు.