అత్యాచారం కేసులో నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష,రూ.15వేల జరిమానా

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 12: పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది.క్రైమ్ నంబర్ 85/2021గా నమోదైన ఈ కేసులో నిందితుడు కొర్లపాటి అరుణ్‌కు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు కొర్లపాటి అరుణ్ (29),మంఛిర్యాల జిల్లా నస్పూర్ సీసీసీ ప్రాంతానికి చెందినవాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376,417,420...